పంచాయతీ ఎన్నికలపై ప్రజలకు అవగాహన
ఏసీపీ రూరల్ తిరుపతిరెడ్డి
Views: 13
On
ఖమ్మం బ్యూరో, నవంబర్ 28, తెలంగాణ ముచ్చట్లు;
గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎటువంటి ఘర్షణలకు తావు లేకుండా పోలీసులకు సహకరించాలని ఖమ్మం రూరల్ ఏసిపి తిరుపతిరెడ్డి తెలిపారు. పోలీస్ కమిషనర్ సునీల్ ఆదేశాల మేరకు రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ముదిగొండ గ్రామ ప్రజలతో మమేకమై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ప్రజలు ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునే విధంగా పోలీస్ శాఖ అండగా ఉంటుందని, ప్రజా రక్షణ, భద్రత పోలీసుల లక్ష్యమని అన్నారు. గ్రామాలలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
13 Dec 2025 21:23:59
పెద్దమందడి,డిసెంబర్13(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డిని వనపర్తి...


Comments