కాప్రాలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య కలకలం
కుషాయిగూడ, డిసెంబర్ 09 (తెలంగాణ ముచ్చట్లు):
కాప్రా మున్సిపాలిటీ పరిధిలోని సైనిక్‌పురిలో సోమవారం రాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న శ్రవణ్ కుమార్ (35) కుటుంబ సంబంధిత సమస్యల నేపథ్యంలో మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది.ప్రాథమిక సమాచారం మేరకు—అతను సోమవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తీవ్ర మనస్తాపానికి గురై జీవితాన్ని ముగించుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాత్రి భోజన సమయానికి బయటకు రానట్టుగా గమనించిన కుటుంబ సభ్యులు అనుమానంతో గది తలుపు తొలిచే ప్రయత్నం చేసినటుగా తెలుస్తోంది. తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లి చూస్తే శ్రవణ్ అచేతన స్థితిలో కనిపించడంతో అతన్ని అత్యవసరంగా సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు అప్పటికే మరణించినట్టు ధృవీకరించారు.సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలం, వ్యక్తిగత కారణాలు వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది.ఈ ఘటనతో స్థానిక ప్రాంతంలో విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.


Comments