అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం కమిటీ సభ్యులకు సన్మానం ప్రశంస పత్రాలు
కాప్రా, డిసెంబర్ 09 (తెలంగాణ ముచ్చట్లు) :
ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 10న జరుపుకునే అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ తెలంగాణ, మల్కాజ్గిరి పార్లమెంట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం కాప్రా పరిధిలోని హ్యూమన్ రైట్స్ పార్లమెంట్ కార్యాలయంలో నిర్వహించారు.1948లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఆమోదించిన సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన (యుడిహెచ్ఆర్)ను స్మరించుకుంటూ, ప్రతి వ్యక్తికి గౌరవం, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అందేలా పనిచేయడం తమ ధ్యేయమని ఈ సందర్భంగా పాల్గొన్న వారు పేర్కొన్నారు.కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షురాలు డా. ఆర్.వి. లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై మానవ హక్కుల ప్రాధాన్యంపై కమిటీ సభ్యులకు అవగాహన కల్పించారు. హ్యూమన్ రైట్స్ పరిరక్షణలో సేవలందిస్తున్న కమిటీ సభ్యులను ప్రశంసిస్తూ వారికి ప్రశంస పత్రములను అందజేశారు.ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రసిడెంట్ వెంకటేష్ చారి, ఉప్పల్ నియోజకవర్గ ప్రసిడెంట్ తాడూరి గగన్ కుమార్, సభ్యులు రమేష్, మంజుల, ఆకుల పద్మావతి, మంగమ్మ, నర్సింహ చారి తదితరులు పాల్గొన్నారు.


Comments