కాంట్రాక్ట్–ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఇన్‌చార్జిగా మురళి నియామకం.

కొత్తగూడెం ప్రాంత ఉపాధ్యక్షుడు రజాక్ నియామక పత్రం అందజేత.

కాంట్రాక్ట్–ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఇన్‌చార్జిగా మురళి నియామకం.

సత్తుపల్లి, నవంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి పట్టణంలోని సింగరేణి శాఖలో కాంట్రాక్ట్–ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం ప్రాంత ఉపాధ్యక్షుడు రజాక్ హాజరయ్యారు.

సింగరేణి సంస్థలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐఎన్టీయూసీ సంఘం కృషి చేస్తోందని రజాక్ పేర్కొన్నారు. ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్ నాయకత్వంలో సింగరేణి బొగ్గు గనుల కాంట్రాక్ట్–ఔట్సోర్సింగ్ సంఘం బలోపేతానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు.

సత్తుపల్లి ప్రాంతంలో సంఘ బలోపేతం కోసం, ఉద్యోగుల సమస్యలపై చురుకైన చర్యలు తీసుకునేందుకు గాదే మురళీ కృష్ణను ఇన్‌చార్జిగా నియమిస్తూ నియామక పత్రం అందజేసినట్లు రజాక్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సింగరేణి లాభాలలో భాగంగా తొలి సంవత్సరంలో 5,000 రూపాయలు, రెండవ సంవత్సరంలో 5,500 రూపాయలు అందేలా చేసిన కీర్తి ఐఎన్టీయూసీదేనని ఆయన వివరించారు. ఉద్యోగులందరూ సంఘ బలోపేతానికి తమ వంతు కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో క్రాంతి కుమార్, రామారావు, బాలాజీ, పోచం శ్రీనివాస్, మల్లారపు కొమరయ్య, కొలుగూరి వెంకటస్వామి, బాజీ, రవిశంకర్, ఖాజా, చాంద్, ఐ.వి.రెడ్డి, శ్రీధర్, సురేష్, శ్రీనివాస్, సందీప్, దావూద్, రాము, రాంబాబు, అఫ్రోజ్, పాషా, రాజశేఖర్, కిరణ్, గోపి, విజయ్, శుభానీ, వీరబాబు, రాజేష్, ప్రసాద్, సత్యం, ఎస్‌ కె. శుభానీ, ఎల్.శ్రీను, లోకేష్, పవన్, కె.వెంకటేశ్వరరావు, రమేష్ తదితర నాయకులు, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .