నల్ల చట్టాల రద్దు కోరుతూ దేశవ్యాప్త సమ్మె.
సమ్మె బుక్లెట్లు విడుదల చేసిన మల్లూరు.
సత్తుపల్లి, జనవరి 10 (తెలంగాణ ముచ్చట్లు):
వేంసూరు మండల కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయ ప్రాంగణంలో శనివారం సీఐటీయూ రాష్ట్ర కమిటీ ముద్రించిన సమ్మె బుక్లెట్లను జిల్లా సహాయక కార్యదర్శి మల్లూరు చంద్రశేఖర్ ఆవిష్కరించారు. నల్ల చట్టాల రద్దు కోరుతూ దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా మల్లూరు స్పష్టం చేశారు. ఫిబ్రవరి 12న మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్లు, విత్తన చట్టం, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు ఈ సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు.
ఈ సమ్మె అంశాలపై సీఐటీయూ రాష్ట్ర సీనియర్ నేత ఎస్.వీరయ్య రూపొందించిన వివరాలు బుక్లెట్‌లో పొందుపరచినట్లు మల్లూరు మీడియాకు తెలిపారు. బుక్లెట్లను కార్మికులకు పంపిణీ చేసి చైతన్యం కల్పించాలని మండల కమిటీ సభ్యులకు సూచించారు. సమ్మెలో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పూరేటి సుగుణరావు, నేరెళ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.


Comments