పలు కుటుంబాలకు మాజీ ఎంపీ నామ పరామర్శ

పలు కుటుంబాలకు మాజీ ఎంపీ నామ పరామర్శ

ఖమ్మం బ్యూరో, జనవరి 8(తెలంగాణ ముచ్చట్లు)

బీఆర్ఎస్ మాజీ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గురువారం నాడు జిల్లాలో పర్యటించారు. అందులో భాగంగా పలు కుటుంబాలను ఆయన పరామర్శించారు. తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం వాస్తవ్యులు, మాజీ జడ్పీటీసీ ఇంటూరి బేబి మాతృమూర్తి, మాజీ డీసీసీబీ డైరెక్టర్ శేఖర్ అత్తయ్య నూకారపు వీరమ్మ పెద్దకర్మ కు హాజరై ఆమె చిత్ర పటానికి పూలు వేసి ఘన నివాళులర్పించారు. అలానే వీరమ్మ భర్త రామనాథంను వారి కుటుంబ సభ్యులను నామ పరామర్శించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో నామ వెంట తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, కూసుమంచి,  బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భాష బోయిన వీరన్న, బెల్లం వేణుగోపాల్, వేముల వీరయ్య, జిల్లా నాయకులు, మల్లీడి వెంకన్న, కనకమేడల సత్యనారాయణ, మోరంపూడి ప్రసాదరావు, మాజీ జడ్పీటీసీ వై వరప్రసాద్, రామచంద్రనాయక్, నాయకులు మట్టా వెంకటేశ్వరావు, బాలాజీ, శ్రీను, ఊడుగు వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

అంతకు ముందు ఖమ్మం కార్పొరేషన్ మూడవ పట్టణ వాస్తవ్యులు కాంపాటి రామచంద్రయ్య ఇటీవల పరమపదించారు కాగా నామ నాగేశ్వరరావు వారి స్వగృహానికి వెళ్లి రామచంద్రయ్య చిత్ర పటానికి పూలు వేసి నివాళులర్పించారు.  వారి కుమారులు కాంపాటి అనంతరామయ్య, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు ను పరామర్శించారు.

ఈ కార్యక్రమం లో  తాళ్లూరి శ్రీనివాసరావు, బాతురాజు కనకయ్య, వాకాదాని కోటేశ్వరరావు, పాల్వంచ రాజేష్, తాళ్లూరి హరీష్, రేగళ్ల కృష్ణ ప్రసాద్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.IMG-20260108-WA0087

Tags:

Post Your Comments

Comments

Latest News

పలు కుటుంబాలకు మాజీ ఎంపీ నామ పరామర్శ పలు కుటుంబాలకు మాజీ ఎంపీ నామ పరామర్శ
ఖమ్మం బ్యూరో, జనవరి 8(తెలంగాణ ముచ్చట్లు) బీఆర్ఎస్ మాజీ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గురువారం నాడు జిల్లాలో పర్యటించారు....
యాగంటి శ్రీనివాసరావు మృతి పట్ల మాజీ ఎంపీ నామ దిగ్భ్రాంతి
పొంగులేటి ఇంట ఆత్మీయ ‘మాధురి’యం..!
ఖమ్మంలో సిపిఐ మోటార్ సైకిల్ ర్యాలీ
రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు దూరం 
గ్రావెల్ తరలిస్తున్న రెండు టిప్పర్ల పట్టివేత 
వెల్టూర్‌ లో ఘనంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి జన్మదిన వేడుకలు