కీసరగుట్ట దేవస్థానం నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం

కీసరగుట్ట దేవస్థానం నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం

ముఖ్య అతిథులుగా ఎంపీ ఈటల రాజేందర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వజ్రెష్ యాదవ్

 కీసర, జనవరి 07 (తెలంగాణ ముచ్చట్లు)

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ ఆలయానికి చేరుకుని శ్రీ రామలింగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం నూతన చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసిన తటాకం వెంకటేష్‌కు, అలాగే నూతన పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ కూడా ముఖ్య అతిథిగా పాల్గొని, దేవస్థానం అభివృద్ధి దిశగా పాలకవర్గం సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో 2026 సంవత్సరానికి సంబంధించిన నూతన క్యాలెండర్‌ను ఎంపీ ఈటల రాజేందర్ ఆవిష్కరించారు. కీసరగుట్టను మరింత ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా పలువురు నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.IMG-20260107-WA0054

Tags:

Post Your Comments

Comments

Latest News

పలు కుటుంబాలకు మాజీ ఎంపీ నామ పరామర్శ పలు కుటుంబాలకు మాజీ ఎంపీ నామ పరామర్శ
ఖమ్మం బ్యూరో, జనవరి 8(తెలంగాణ ముచ్చట్లు) బీఆర్ఎస్ మాజీ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గురువారం నాడు జిల్లాలో పర్యటించారు....
యాగంటి శ్రీనివాసరావు మృతి పట్ల మాజీ ఎంపీ నామ దిగ్భ్రాంతి
పొంగులేటి ఇంట ఆత్మీయ ‘మాధురి’యం..!
ఖమ్మంలో సిపిఐ మోటార్ సైకిల్ ర్యాలీ
రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు దూరం 
గ్రావెల్ తరలిస్తున్న రెండు టిప్పర్ల పట్టివేత 
వెల్టూర్‌ లో ఘనంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి జన్మదిన వేడుకలు