మున్సిపల్ ఓటర్ జాబితాపై అభ్యంతరాలను పరిష్కరించాలి
రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని
ఖమ్మం బ్యూరో, జనవరి - 07,(తెలంగాణ ముచ్చట్లు)
మున్సిపల్ ఓటర్ జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులను నిర్ణిత గడువులోగా పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని అన్నారు.
మున్సిపల్ ఓటర్ జాబితా తదితర అంశాలపై జిల్లాల కలెక్టర్లు, అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్, హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్షించగా, ఇట్టి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అదనపు కలెక్టర్లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి లతో కలిసి కలెక్టరేట్ నుండి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ జిల్లాల వారీగా ఓటరు జాబితాలపై వచ్చిన అభ్యంతరాల వివరాలను సమీక్షించి మాట్లాడుతూ, ఈ నెల 12 వ తేదీ నాడు వార్డుల వారిగా ఫోటో ఎలక్టరోల్స్ జాబితా ప్రచురించడంతో పాటు, 13వ తేదీన డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాలను ప్రచురిస్తామని తెలిపారు. 16వ తేదీన తుది పోలింగ్ కేంద్రాల వివరాలను ప్రచురించి, పోలింగ్ కేంద్రాల వారీగా ఫోటో ఎలక్టరోల్స్ ప్రచురిస్తామని వెల్లడించారు. అభ్యంతరాలు, ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పరిశీలించి, పరిష్కరించాలని ఆదేశించారు.
2025 సంవత్సరం సంబంధించి 3వ సప్లిమెంటరీ ఓటరు జాబితా నవంబర్ 15వ తేదీన విడుదలైందని, దాని ప్రకారం పట్టణాలలో వార్డుల వారీగా డ్రాఫ్ట్ ఓటరు జాబితా జనవరి 1వ తేదీన విడుదల చేశామని తెలిపారు. అవసరమున్న అన్నిచోట్లా వెబ్ కాస్టింగ్ కు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, జిల్లాలో ఓటర్ జాబితా లపై 192 అభ్యంతరాలు రాగా, ఇప్పటికి 129 అభ్యంతరాలను పరిష్కరించినట్లు, మిగులు ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించ నున్నట్లు తెలిపారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఉన్న సిబ్బంది డాటాను మునిసిపల్ ఎన్నికల లోను తీసుకోనున్నట్లు అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు,
మున్సిపల్ కమీషనర్లు శ్రీనివాస రెడ్డి, సంపత్, నర్సింహ, రామచందర్ రావు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Comments