వెల్టూర్ లో ఘనంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి జన్మదిన వేడుకలు
పెద్దమందడి,జనవరి8(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రేమ సాగర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను ఉత్సాహంగా జరిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మేఘా రెడ్డి దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నాయకులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
ఎమ్మెల్యే మేఘా రెడ్డి జన్మదినాన్ని సామాజిక సేవతో ముడిపెడుతూ, వెల్టూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు నోట్ బుక్స్ , పెన్నులు, పరీక్షల ప్యాడ్స్‌ను కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం పట్ల గ్రామస్తులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎమ్మెల్యే మేఘా రెడ్డి చేస్తున్న సేవలు ప్రశంసనీయమని, నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజలకు మరింత చేరువై సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో ఎమ్మెల్యే మేఘా రెడ్డి పాత్ర కీలకమని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రేమ్ సాగర్,మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, బాలచంద్రయ్య, గ్రామ మాజీ అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి,(బాబు రెడ్డి), డిఎస్. మహేష్, మల్లికార్జున్, వడ్డె శేఖర్, సి.వెంకటయ్య, వివేక్, రవీందర్, గుండెల ఆంజనేయులు,నాగభూషణ్,మహేశ్ రెడ్డి,మద్దూర్ వెంకటయ్య, అనంత రెడ్డి, కుమ్మరి కొండన్న, చందు రెడ్డి,గోవర్ధన్ రెడ్డి, పట్నం సత్యన్న, పాముల రాములు, మహేందర్, లాల్,శశివర్ధన్ రెడ్డి, బలిదు పల్లి,చిలక టోనీ పల్లి, గ్రామాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


Comments