ఉర్సు ఉత్సవాల నేపథ్యంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి

మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ ఐఏఎస్  ఆకస్మిక పర్యటన

ఉర్సు ఉత్సవాల నేపథ్యంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి

మల్కాజిగిరి, డిసెంబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):

జిహెచ్ఎంసి మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ ఐఏఎస్ సోమవారం ఉదయం 6 గంటల నుంచే పారిశుధ్య పర్యవేక్షణలో భాగంగా ఆకస్మిక పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా లాలాపేట్ ఫ్లైఓవర్, మౌలాలి హజరత్ అలీ అబిన్ కోయి మౌలాలి దర్గా పరిసర ప్రాంతాలు, నేరేడ్మెట్ ఎఫ్ఓబి (ఫుట్ ఓవర్ బ్రిడ్జ్) మరియు వాయుపురి చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్‌లను పరిశీలించారు.మౌలాలి దర్గా పుట్టినరోజు మరియు ఉర్సు ఉత్సవాల నేపథ్యంలో భక్తులు, యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుధ్య నిర్వహణ పటిష్టంగా ఉండాలని కమిషనర్ అధికారులకు ఆదేశించారు. దర్గా పరిసరాల్లో పారిశుధ్య పనులు మూడు షిఫ్టులుగా నిర్వహించాలని, అవసరమైన చోట్ల డస్ట్‌బిన్లు ఏర్పాటు చేయాలని, కొండపై బహిరంగంగా చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే తాత్కాలిక మూత్రశాలలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.నేరేడ్మెట్‌లోని ఎఫ్ఓబి తనిఖీలో పారిశుధ్య లోపాలు గుర్తించిన కమిషనర్, ప్రతిరోజూ శుభ్రం చేయాలని, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా రాత్రి వేళల్లో కూడా ప్రత్యేక సిబ్బందిని నియమించాలని సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను ఆదేశించారు.లాలాపేట్ ఫ్లైఓవర్ బ్రిడ్జి తనిఖీలో సెంట్రల్ డివైడర్‌పై రాళ్లు, మట్టి కుప్పలు, పిచ్చి మొక్కలు లేకుండా చర్యలు తీసుకోవాలని, గ్రీన్ వేస్ట్‌ను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే వాయుపురి చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్ పనితీరును పరిశీలించి, రోజువారీగా చెత్త నిల్వలు లేకుండా వెంటనే జవహర్‌నగర్‌కు తరలించాలని ఆదేశించారు.ఈ పర్యటనలో మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్‌తో పాటు డిప్యూటీ కమిషనర్ గోపాల్ రావు, ఈఈ లక్ష్మణ్, సర్కిల్ ఉపవైద్యాధికారి డాక్టర్ కె. మంజుల, డీఈఈ (ఎస్‌డబ్ల్యూఎం) మహేశ్వర్, ఏఈ మధురిమ, సానిటరీ సూపర్వైజర్ శ్రీనివాస్, ఎస్‌ఎఫ్‌ఏ తదితరులు పాల్గొన్నారుIMG-20251229-WA0070

Tags:

Post Your Comments

Comments

Latest News

పలు కుటుంబాలకు మాజీ ఎంపీ నామ పరామర్శ పలు కుటుంబాలకు మాజీ ఎంపీ నామ పరామర్శ
ఖమ్మం బ్యూరో, జనవరి 8(తెలంగాణ ముచ్చట్లు) బీఆర్ఎస్ మాజీ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గురువారం నాడు జిల్లాలో పర్యటించారు....
యాగంటి శ్రీనివాసరావు మృతి పట్ల మాజీ ఎంపీ నామ దిగ్భ్రాంతి
పొంగులేటి ఇంట ఆత్మీయ ‘మాధురి’యం..!
ఖమ్మంలో సిపిఐ మోటార్ సైకిల్ ర్యాలీ
రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు దూరం 
గ్రావెల్ తరలిస్తున్న రెండు టిప్పర్ల పట్టివేత 
వెల్టూర్‌ లో ఘనంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి జన్మదిన వేడుకలు