అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి 

అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి 

ఉప్పల్, డిసెంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ డివిజన్‌లో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. డివిజన్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారు.ఈ నేపథ్యంలో కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి ఉప్పల్ సూర్యనగర్ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. ఈ ప్రాంతంలోని కాలనీల్లో రూ.1 కోటి 25 లక్షల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఏఈ రాజ్‌కుమార్‌తో పాటు కాలనీ వాసులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, త్వరలోనే న్యూ భారత్ నగర్ కాలనీలో కూడా సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని కార్పొరేటర్ తెలిపారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో కాలనీ గౌరవ అధ్యక్షులు పూస మల్లేశం, వైస్ ప్రెసిడెంట్ మెట్టు కనక రెడ్డి, బండి మల్లారెడ్డి, సల్లా ప్రభాకర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ కప్పరి యెల్లేష్ కుమార్, గుడి కమిటీ ఉపాధ్యక్షులు వేముల దుర్గారెడ్డి, సభ్యులు సుగామంచి చౌడమ్మ, గుండ్లపల్లి మాలతి, తుంగ వెంకటమ్మ, అన్నపురెడ్డి వెంకటరెడ్డి, పంగ నరసింహారెడ్డి, దోమకొండ నర్సింలు, పూల లీగం, రవి యాదవ్, మీశ్రీ లాల్ గొందే, కే. వెంకట సుబ్బారావు తదితరులు మరియు న్యూ భారత్ నగర్ కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.IMG-20251227-WA0047

Tags:

Post Your Comments

Comments

Latest News

గ్రామ అభివృద్ధికి ముందడుగు.. గ్రామ అభివృద్ధికి ముందడుగు..
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 27(తెలంగాణ ముచ్చట్లు) కాకరవాయి గ్రామం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. గ్రామ సర్పంచ్ గూడూరు ఉపేందర్ రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవనే లక్ష్యంగా చేసుకొని పాలన...
బొల్లికొండ వెంకటేశ్వర్లుకు నివాళులు అర్పించిన జూపెడ సర్పంచ్ నరేందర్ రెడ్డి..
మున్సిపల్ సమస్యలపై బీజేపీ పోరాటానికి సిద్ధం.!
సాయిమల అయ్యప్పస్వామి దేవాలయంలో 18వ పడిపూజ 
సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ.!
మేడ్చల్ జిల్లా మున్నూరుకాపు సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
నాచారం సర్కిల్ ఏర్పాటు పట్ల అధికారులకు కార్పొరేటర్ కృతజ్ఞతలు