నాచారం సర్కిల్ ఏర్పాటు పట్ల అధికారులకు కార్పొరేటర్ కృతజ్ఞతలు
శాంతి సాయిజెన్ శేఖర్
నాచారం, డిసెంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం లో కొత్తగా ఏర్పాటు చేసిన నాచారం సర్కిల్ పట్ల నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ సంబంధిత ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాచారం ప్రాంత అభివృద్ధికి ఇది కీలకమైన ముందడుగుగా పేర్కొన్నారు.
పాత నాచారం వార్డు కార్యాలయం స్థానంలో సుమారు రూ.1 కోటి 50 లక్షల వ్యయంతో స్టిల్ + 3 అంతస్తుల భవనాన్ని నిర్మించుకోవడం జరిగిందన్నారు. ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ భవనం ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.ఈ భవనాన్ని నాచారం సర్కిల్ కార్యాలయంగా వినియోగించుకోవాలని అధికారులను ఆమె అధికారికంగా కోరినట్లు తెలిపారు. సర్కిల్ కార్యాలయం నాచారంలో ఏర్పాటు కావడం వల్ల ప్రజలకు పరిపాలన మరింత చేరువవుతుందని, ఫిర్యాదులు, అభివృద్ధి పనులు, మున్సిపల్ సేవలు వేగంగా పరిష్కారం అవుతాయని అన్నారు.
నాచారం సర్కిల్ ఏర్పాటుతో పాటు కార్యాలయం కూడా అదే ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ప్రజలకు తిరుగుబాటు తగ్గి సమయసేవలు అందుతాయని కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ స్పష్టం చేశారు. అధికారులు ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.


Comments