రైతులు ఉచిత నట్టల నివారణ మందులను సద్వినియోగం చేసుకోవాలి
డాక్టర్ స్వరూపరాణి
వడ్డేపల్లి,డిసెంబర్26(తెలంగాణ ముచ్చట్లు):
గొర్రెలు, మేకలకు ముందస్తుగా నట్టల నివారణ మందులు తప్పనిసరిగా తాగించుకోవాలని వడ్డేపల్లి మండల పశు వైద్య అధికారి డాక్టర్ స్వరూపరాణి తెలిపారు. పశు వైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వడ్డేపల్లి మండలంలోని కొంకల, వెంకట్రామనగర్, జిల్లేడుదిన్నెలో పశు వైద్య సిబ్బంది గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందులు తాగించినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో ఇరవై రెండు మంది గొర్రెలు పెంపకందారులకు చెందిన మొత్తం మూడు వేల ఏడు వందల పదిహేను జీవాలకు నట్టల నివారణ మందులు తాగించినట్లు తెలిపారు. ఇందులో మూడు వేల రెండు వందల యాభై ఐదు గొర్రెలు, నాలుగు వందల అరవై మేకలు ఉన్నాయని పేర్కొన్నారు. నట్టల నివారణ వల్ల జీవాలు త్వరగా బలంగా మారుతాయని, మాంసం పెరుగుతుందని, దీంతో రైతులకు ఆర్థిక లాభం చేకూరుతుందని వివరించారు.ఈ కార్యక్రమంలో వెంకట్రామనగర్ సర్పంచ్ వాసుగౌడ్, మాజీ ఉపసర్పంచ్ కుర్వ గొంగల్ల దేవేంద్ర పాల్గొన్నారు. అలాగే వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ పి. వర ప్రసాద్, లైవ్ స్టాక్ అసిస్టెంట్ షేక్ లతీఫ్, ఓఎస్‌లు వెంకటమ్మ, కృష్ణ, రవి పాల్గొన్నారు. రైతులు ఇలాంటి ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలని పశు వైద్య సిబ్బంది సూచించారు.


Comments