ఉత్తమ ఇంటీరియర్ డిజైన్ అవార్డు అందుకున్న పద్మజ సింగ్
హైదరాబాద్, డిసెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
హైటెక్ సిటీ నోవోటల్ హోటల్‌లో హైబీజ్ టీవీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఉత్తమ పారిశ్రామికవేత్తల అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో ఉత్తమ ఇంటీరియర్ డిజైనర్ విభాగంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, ది లోటస్ స్టూడియో అధినేత్రి పద్మజ సింగ్ ఉత్తమ ఇంటీరియర్ డిజైన్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును హైబిజ్ టీవీ అధినేత రాజగోపాల్ రెడ్డి ఆమెకు అందజేశారు.గత 22 సంవత్సరాలుగా ఇంటీరియర్ డిజైన్ రంగంలో పద్మజ సింగ్ అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తించి ఈ అవార్డు ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పద్మజ సింగ్ మాట్లాడుతూ, ఈ అవార్డు తమపై మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు.అపార్ట్మెంట్లు, విల్లాలు, ఆఫీసులు, హాస్పిటళ్లు, జువెల్లరీ షోరూమ్‌లు, ఫామ్ హౌస్‌లకు ప్రత్యేకంగా ఫర్నిచర్ డిజైన్ విభాగంలో ది లోటస్ స్టూడియో సేవలు అందిస్తోందని తెలిపారు. భవిష్యత్తులో హైదరాబాద్‌లో మరిన్ని బ్రాంచ్‌లను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
అవార్డు అందుకున్న సందర్భంగా రాజ్ సింగ్, గౌతమ్, మానస పద్మజ సింగ్‌కు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు.


Comments