బేతల్ గోస్పాల్ చర్చ్‌లో ఘనంగా క్రిస్మస్ ఉత్సవాలు
ఏ ఎస్ రావు నగర్, డిసెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు)
క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకుని బేతల్ గోస్పాల్ చర్చ్‌లో పాస్టర్ సురపనేని ప్రభు ప్రసాద్ ఆధ్వర్యంలో క్రిస్మస్ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల చారి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు హాజరయ్యారు.ఈ సందర్భంగా వేణుగోపాల చారి మాట్లాడుతూ, సర్వ మానవాళి పాపాలను కడగడానికి దేవుని రూపంలో జన్మించిన యేసుక్రీస్తు ప్రేమ, క్షమ, త్యాగాలకు ప్రతీక అని అన్నారు. యేసుక్రీస్తు బోధనలు సర్వ మానవాళికి మార్గదర్శకమని, ప్రతి ఒక్కరూ సర్వ జీవులను ప్రేమతో చూడాలని ఆయన పిలుపునిచ్చారు.క్రిస్మస్ సందర్భంగా చర్చ్‌లో ప్రత్యేక ప్రార్థనలు, కీర్తనలు నిర్వహించగా, పరిసర ప్రాంతాలు పండుగ వాతావరణంతో కళకళలాడాయి.ఈ కార్యక్రమాల్లో సూరపనేని అనుప్, నాదెండ్ల భాస్కరరావు, శంకర్ రావు, అలాగే వివిధ కాలనీలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.క్రిస్మస్ ఉత్సవాలు ఆనందోత్సాహాలు, ఆధ్యాత్మిక సందేశాలతో విజయవంతంగా ముగిశాయి.


Comments