మౌంట్ జియన్ మినిస్ట్రీస్‌లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
Views: 18
On
కాప్రా, డిసెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ మీర్పేట్ హెచ్ బి కాలనీ ఇంద్రానగర్ కాలనీ ఫేజ్–2 లోని మౌంట్ జియన్ మినిస్ట్రీస్ లో క్రిస్మస్ ఆరాధన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ కాపరి రెవ. కె. ఊర్మిళ ఆనంద్ ఏసుక్రీస్తు పవిత్ర జననం, ఆయన బోధించిన ప్రేమ, శాంతి, క్షమ అనే విలువలపై సందేశం అందించారు.ఈకార్యక్రమంలో చిన్నారులు క్రిస్మస్ పాటలతో దేవుణ్ని ఆరాధించగా, యువకులు నృత్యాలు, గీతాల ద్వారా తమ భక్తిని వ్యక్తం చేశారు. సంఘ సభ్యులు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆరాధనలో భాగమయ్యారు.ఆరాధన అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి, పరస్పరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ వేడుకలు ఆనందోత్సాహాలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో సాగాయి.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments