మణిగిల్ల గ్రామంలో పైప్‌లైన్ లీకేజీకి తక్షణ చర్యలు
గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్
పెద్దమందడి,డిసెంబర్25(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలోని వెంకన్న చెరువు వెనుక ఉన్న మంచినీటి బోరు పైప్‌లైన్‌లో ఏర్పడిన లీకేజీ సమస్యను గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ స్వయంగా పరిశీలించారు. సమస్య తీవ్రతను గమనించిన వెంటనే సంబంధిత సిబ్బందితో మాట్లాడి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.ఈ సందర్భంగా సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు నిరంతరంగా స్వచ్ఛమైన తాగునీరు అందించడం గ్రామపంచాయతీ ప్రధాన బాధ్యత అని అన్నారు.తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా సమస్యలు గుర్తించిన వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. పైప్‌లైన్ లీకేజీ కారణంగా నీటి వృథా జరుగుతుండటాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే చర్యలు తీసుకున్నామని చెప్పారు.సర్పంచ్ ఆదేశాల మేరకు పైప్‌లైన్ మరమ్మతుల పనులను వెంటనే ప్రారంభించగా, త్వరలోనే పనులు పూర్తి చేసి సాధారణ నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని సంబంధిత సిబ్బంది తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు సుంచర మోని రాములు, మద్దిరాల రామ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బోయిన్ కృష్ణ, ప్రేమ్ కుమార్, గణేష్, గొల్ల సోమయ్య, ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొని సహకరించారు.


Comments