అటల్ బిహారీ వాజ్‌పేయీ 101వ జయంతి చిత్రపటానికి ఘన నివాళులు
చర్లపల్లి, డిసెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):
భారతరత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ 101వ జయంతి సందర్భంగా గురువారం చర్లపల్లి డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. డివిజన్ అధ్యక్షులు చల్ల ప్రభాకర్ నేతృత్వంలో చక్రిపురం చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద వాజ్‌పేయీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా చల్ల ప్రభాకర్ మాట్లాడుతూ, భారత అభివృద్ధి గమనంలో నవశకానికి నాంది పలికిన మహానేత అటల్ బిహారీ వాజ్‌పేయీ పాలనాదక్షతకు ప్రతీక అని అన్నారు. సుపరిపాలనకు నూతన నిర్వచనం ఇచ్చిన నాయకుడిగా ఆయన దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. మాటల చాతుర్యం, నిర్ణయాల్లో దృఢసంకల్పం, దేశ ప్రయోజనాల పట్ల అచంచల నిబద్ధత వాజ్‌పేయీని భారత రాజకీయాల్లో ప్రత్యేక నాయకుడిగా నిలబెట్టాయని తెలిపారు.రాజకీయాలలో రాష్ట్రనీతిజ్ఞత, ప్రజాస్వామ్య విలువలు, దేశభక్తికి వాజ్‌పేయీ జీవితం నిజమైన నిదర్శనమని, ఆయన ఆశయాలు తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కాసుల సురేందర్ గౌడ్, దేవనాధం, ఆనంద్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, గణేష్ ముదిరాజ్, లక్ష్మినారాయణ, సహదేవ గౌడ్, రమేష్ చౌదరి, విద్యాసాగర్, రాజు, కళావతి, శ్రీకాంత్, శివప్రసాద్, వెంకటేష్ యాదవ్, వెంకటేశ్వర్లు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.


Comments