కాప్రా సర్కిల్ లో  డిప్యూటీ కమిషనర్‌గా కె. శ్రీహరి బాధ్యతలు స్వీకరణ

కాప్రా సర్కిల్ లో  డిప్యూటీ కమిషనర్‌గా కె. శ్రీహరి బాధ్యతలు స్వీకరణ

కాప్రా, డిసెంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా మున్సిపాలిటీలో నూతన డిప్యూటీ కమిషనర్‌గా కె. శ్రీహరి బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించిన ఆయన, తాజాగా కాప్రా మున్సిపాలిటీలో డీసీగా నియమితులై బాధ్యతలు చేపట్టారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించి, జరుగుతున్న అభివృద్ధి పనులు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, రోడ్లు, డ్రైనేజీ తదితర అంశాలపై సమీక్షించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని ఈ సందర్భంగా కె. శ్రీహరి తెలిపారు.కాప్రా మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులను వేగవంతం చేసి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.IMG-20251227-WA0053

Tags:

Post Your Comments

Comments

Latest News

క్రైస్తవ సోదరులకు ప్రభుత్వ విందు  క్రైస్తవ సోదరులకు ప్రభుత్వ విందు 
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 27(తెలంగాణ ముచ్చట్లు) చింతకాని మండల కేంద్రంలో శనివారం నాడు కిలారు జగన్మోహనరావు మామిడి తోటలో ప్రభుత్వం క్రైస్తవ సోదరులకు ప్రభు విందు భోజనాల...
దశదిన కర్మకు హాజరు అయిన వడ్డెర సంఘం జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు
గ్రామ అభివృద్ధికి ముందడుగు..
బొల్లికొండ వెంకటేశ్వర్లుకు నివాళులు అర్పించిన జూపెడ సర్పంచ్ నరేందర్ రెడ్డి..
మున్సిపల్ సమస్యలపై బీజేపీ పోరాటానికి సిద్ధం.!
సాయిమల అయ్యప్పస్వామి దేవాలయంలో 18వ పడిపూజ 
సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ.!