మున్సిపల్ సమస్యలపై బీజేపీ పోరాటానికి సిద్ధం.!

సత్తుపల్లిలో సన్నాహ సమావేశం.

మున్సిపల్ సమస్యలపై బీజేపీ పోరాటానికి సిద్ధం.!

సత్తుపల్లి, డిసెంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి పట్టణ మున్సిపల్ పరిధిలో నెలకొన్న ప్రజా సమస్యలపై రాబోయే రోజుల్లో పోరాటం చేపట్టేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతోంది. ఈ మేరకు సత్తుపల్లి పట్టణ అధ్యక్షుడు బానోతు విజయ అధ్యక్షతన సన్నాహ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సత్తుపల్లికి నూతనంగా పార్టీ ప్రభారీలుగా నియమితులైన పాలేరు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి నున్న రవికుమార్, పార్లమెంట్ కన్వీనర్, సత్తుపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ నంబూరు రామలింగేశ్వరరావు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ, పట్టణంలో తాగునీరు, పారిశుధ్యం, రహదారులు తదితర మౌలిక సమస్యలపై బీజేపీ విస్తృత స్థాయిలో ఉద్యమాలు చేపట్టనుందని తెలిపారు. ప్రతి కార్యకర్త తమ తమ వార్డుల్లో ప్రజల సమస్యలను గుర్తించి, ప్రజలకు అండగా నిలవాలని సూచించారు.
మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు పార్టీ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని, అభ్యర్థులను ముందుగానే సిద్ధం చేస్తూ ఈసారి సత్తుపల్లి మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరవేయడం లక్ష్యమని వారు స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మాజీ పట్టణ అధ్యక్షులు పాలకొల్లు శ్రీనివాస్, ఆచంట నాగస్వామి, మండల ప్రధాన కార్యదర్శి మంద శివయాదవ్, కౌన్సిల్ సభ్యుడు ఎస్.కె. రహమతుల్లా, ఉపాధ్యక్షుడు మన్నెం నర్సింహమూర్తి, కార్యదర్శికార్తీక్ యాదవ్, కోశాధికారి మగసాని ప్రసాద్ యాదవ్, సోషల్ మీడియా కన్వీనర్ మెరుగు శేషగిరిరావు, తొర్లపాటి సాయి వర్ధన్, బండి ఆంజనేయులు, మంద సందీప్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.IMG-20251227-WA0094

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .