సాయిమల అయ్యప్పస్వామి దేవాలయంలో 18వ పడిపూజ
గణపతి హోమం, అభిషేకాలు, భజనలతో మారుమోగిన ఆలయ ప్రాంగణం
కాప్రా, డిసెంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
సాయిమల అయ్యప్పస్వామి దేవాలయంలో జనరల్ సెక్రటరీ మాదిరెడ్డి హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో 18వ పడిపూజ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమం సందర్భంగా ఉదయం గణపతి హోమము, ప్రత్యేక అభిషేకములు, పడిపూజలు నిర్వహించగా, ఈలపాటి శ్రీనివాసరాజు బృందం ఆలపించిన భజనలతో చుట్టుపక్కల ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో మారుమోగింది.
ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే సాయిమల అయ్యప్ప స్వామి దేవాలయం చైర్మన్ రేగళ్ల సతీష్ రెడ్డి, ట్రెజరర్ శేఖర్ చారి, జాయింట్ సెక్రటరీ నిరంజన్ దాస్, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, పజ్జురి పావని రెడ్డి, కృష్ణ యాదవ్, రామారావు, శ్రీహరి గౌడ్, యాదగిరి గౌడ్, కార్తీక్ గౌడ్, బాలకృష్ణారెడ్డి, జై మల్లారెడ్డి, చంద్రకాంత్ రెడ్డి, సంతోష్ రెడ్డి, నరసింహారెడ్డి, భూపాల్ రెడ్డి, చిన్నరెడ్డి, పోలీస్ కృష్ణారెడ్డి, పోలీస్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అయ్యప్పస్వామి కృపతో భక్తులందరికీ ఆరోగ్యం, శాంతి, సమృద్ధి కలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంచివరలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.


Comments