చిన్నారి విశ్వతేజ్ తొలి జన్మదిన వేడుకల్లో నాయకుల సందడి
పెద్దమందడి,డిసెంబర్26(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన డీలర్ విజయ్ కుమార్–లావణ్య దంపతుల కుమారుడు విశ్వతేజ్ తొలి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అశోక్‌తో పాటు పలువురు గ్రామ చెందిన కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు కార్యక్రమానికి హాజరై చిన్నారి విశ్వతేజ్‌ను ఆశీర్వదించారు. అనంతరం తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిన్నారి ఆయురారోగ్యాలతో, ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి చిన్నారితో ప్రత్యేకంగా ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలు సాంప్రదాయబద్ధంగా, ఆనందోత్సాహాల మధ్య కొనసాగి గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్, ఆర్ పెద్ద శ్రీనివాస్ రెడ్డి, వడ్డె శేఖర్, ఎంఈఓ నాగయ్య, ఉపాధ్యాయులు సుదర్శన్ రావు, డి ఎస్ మహేష్, మల్లికార్జున్, దయ్యాల శేఖర్, బండి రాజు (రిపోర్టర్) నరాల ఆంజనేయులు, గుండెల ఆంజనేయులు, నరాల గోపి, ఇరికిచెట్టి ఆంజనేయులు, నాగభూషణ్, చాకలి యాదయ్య, మిల్లర్ రాజు, నక్కల భాస్కర్, మద్దూర్ ఆంజనేయులు, శ్యాంసుందర్, దయ్యాల రమేష్, మద్దూర్ నరసింహ, నరాల బాబు, ఇరికిచెట్టి మోహన్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు పాల్గొన్నారు.


Comments