అమ్మపల్లిలో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టిన సర్పంచ్ గౌని మాధవి
Views: 3
On
పెద్దమందడి,డిసెంబర్26(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులను సర్పంచ్ గౌని మాధవి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామంలోని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు సదుపాయం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు.గ్రామంలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించి, గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రమేష్, సింగిల్ విండో డైరెక్టర్ గౌని వెంకటేశ్వర్ రెడ్డి, బాలు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
27 Dec 2025 17:42:39
ఘట్‌కేసర్, డిసెంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ నియోజకవర్గం ఘట్‌కేసర్ సర్కిల్‌కు నూతన డిప్యూటీ కమిషనర్‌గా వాణి రెడ్డి శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా...


Comments