మల్లాపూర్ డివిజన్‌లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
మల్లాపూర్, డిసెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ మల్లాపూర్ డివిజన్ పరిధిలో బీర్షెబా చర్చి ఆధ్వర్యంలో స్వాగత్ కన్వెన్షన్‌లో క్రిస్మస్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా క్రిస్టియన్ సోదర సోదరీమణులతో కలిసి ఎమ్మెల్యే, కార్పొరేటర్ కేక్ కట్ చేసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం వేదికపై నుంచి డివిజన్ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగను అందరూ సుఖసంతోషాలతో, శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు.అలాగే మల్లాపూర్ డివిజన్ పరిధిలోని వివిధ చర్చిల్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాస్టర్ రంగారావు, వివి రావు, ఫైళ్ల ప్రవీణ్ కుమార్, పద్మరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ముత్యాలు, శ్రీశైలం, కుందన్ తదితరులు పాల్గొన్నారు.


Comments