మీర్పేట్ హెచ్‌బీ కాలనీలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే బండారి
కాప్రా, డిసెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ పరిధిలోని మీర్పేట్ హెచ్ బీ కాలనీ డివిజన్‌లో పలు కాలనీల్లో సుమారు రూ.17 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తూ, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు.అభివృద్ధి పనుల విషయంలో అవసరమైన అన్ని సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ మాట్లాడుతూ,డివిజన్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, డివిజన్ అభివృద్ధికి నిరంతరం సహకారం అందిస్తున్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఈ రూప, ఏఈ స్రవంతి, వర్క్ ఇన్స్పెక్టర్ చారి, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు.చేపట్టిన పనుల వివరాలు:రాజీవ్ నగర్ కాలనీ – చర్చి గల్లీ,గడ్డమీద.కైలాసగిరి – 30 ఫీట్ రోడ్ ట్రాన్స్ఫార్మర్ వద్ద హెచ్‌బీ కాలనీ – ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం, వార్డు కార్యాలయం వెనుక కృష్ణానగర్ – రోడ్ నెంబర్ 5 కె కృష్ణానగర్ – రోడ్ నెంబర్ 3 న్యూ నరసింహ నగర్ – వాగ్దేవి స్కూల్ వద్ద ఓల్డ్ మీర్పేట్ – రామకృష్ణ స్కూల్ ఎదురు గల్లీ,నరసింహనగర్ – ఎనుముల మహేష్ గల్లీ ఓల్డ్ మీర్పేట్ – కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం


Comments