ప్రాణాల మీదకు తెస్తున్న చైనా మాంజా
దారం చుట్టుకుని తీవ్రంగా గాయపడ్డ యువకుడు
కీసర , డిసెంబర్ 26 (తెలంగాణ ముచ్చట్లు):
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చైనా మాంజా మరోసారి ప్రమాదానికి కారణమైంది. కీసర గ్రామం మల్లికార్జున నగర్ కాలనీలో నివాసం ఉంటున్న జశ్వంత్ రెడ్డి అనే యువకుడు చైనా మాంజా దారంతో తీవ్రంగా గాయపడ్డాడు.శుక్రవారం జరిగిన ఈ ఘటనలో రోడ్డుపై వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా చైనా మాంజా దారం జశ్వంత్ రెడ్డి మెడకు చుట్టుకోవడంతో మెడ తీవ్రంగా కోసుకుపోయింది. రక్తస్రావం ఎక్కువగా కావడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అతన్ని సమీపంలోని నితిన్ హాస్పిటల్ కు తరలించారు.ప్రస్తుతం జశ్వంత్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తూ, చైనా మాంజా విక్రయాలు మరియు వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.చైనా మాంజా వల్ల ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలనిముఖ్యంగా యువత ఈ ప్రమాదకర మాంజాను ఉపయోగించవద్దని స్థానికులు కోరుతున్నారు.


Comments