క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న  ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న  ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

కాప్రా, డిసెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్మీర్‌పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్‌లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. IMG-20251225-WA0113ఈ సందర్భంగా ఆయన స్థానిక చర్చ్‌ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.అనంతరం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, సేవాతత్పరత, క్షమాగుణాలను బోధించిన యేసు క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత ఆనందకరమైన రోజు అని అన్నారు. ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో క్రిస్మస్ వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. యేసు క్రీస్తు దీవెనలు ప్రతి ఒక్కరికీ లభించి, అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు శ్రీనివాస్ రెడ్డి, గొల్లూరి అంజయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుమ్మడి జంపాల్ రెడ్డి, పాస్టర్ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .