ఏసు బోధనలు ప్రపంచానికి మార్గదర్శకం
పెద్దమందడి మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి
పెద్దమందడి,డిసెంబర్25(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, క్రిస్మస్ పండుగ శాంతి, ప్రేమ, కరుణ, త్యాగం వంటి మానవీయ విలువలకు ప్రతీక అని అన్నారు. ఏసుక్రీస్తు బోధనలు సర్వ మానవాళికి ఆదర్శప్రాయమని, వాటిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. పరస్పర సహకారం, సహనం, సోదరభావంతో జీవించడమే క్రిస్మస్ పండుగ ప్రధాన సందేశమని తెలిపారు.
సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఐక్యతతో కలిసి ముందుకు సాగాలని, ఏసుప్రభు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్, ఆర్ పెద్ద శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నాయకులు వడ్డే శేఖర్, నాగభూషణ్, పట్నం సత్యన్న, దయ్యాల దానయ్య, క్రైస్తవ సోదరీ, సోదరీమణులు పాల్గొన్నారు.


Comments