కలిసి పని చేద్దాం… జెండా ఎగరేద్దాం

బేషీజాలు వద్దు… పార్టీ పటిష్టతనే ముద్దు

కలిసి పని చేద్దాం… జెండా ఎగరేద్దాం

 డిసిసి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి,డిసెంబర్25(తెలంగాణ ముచ్చట్లు):

గురువారం వనపర్తి జిల్లాలో నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ డిసిసి అధ్యక్షుడు కొత్త కాపు శివసేన రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వనపర్తి ఎమ్మెల్యే  తూడి మేఘారెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయనకు శాలువాలు కప్పి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం నూతన డీసీసీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇందిరాపార్క్, రాజీవ్ చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తాకు చేరుకుని మాజీ రాజ్యసభ సభ్యులు  హనుమంతరావుతో కలిసి డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆప్కారి శాఖ జూపల్లి కృష్ణారావు , రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి  వాకిటి శ్రీహరి , ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ..
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ పని అయిపోయిందని వ్యాఖ్యానించారు. కుటుంబ కుమ్ములాటలతో ఆ పార్టీ పూర్తిగా కూలిపోవడం ఖాయమని అన్నారు. అలాంటి పరిస్థితిలో ఉన్న పార్టీ నాయకులు కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పేరుతో కమిషన్ల కోసమే పనులు చేసి మధ్యలో వదిలేసిన వారు, నేడు అదే ప్రాజెక్టుపై మాట్లాడటం విడ్డూరమన్నారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులకు బొక్కలు పెట్టి, మేమే నీరు తెచ్చామని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు.పదేళ్ల కాలంలో ప్రజల సమస్యలను పట్టించుకోని పాలనకు భిన్నంగా, ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ వారి కలను నెరవేరుస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని స్పష్టం చేశారు.రానున్న ఎన్నికలు ఏవైనా సరే కాంగ్రెస్ పార్టీ జెండానే ఎగిరేలా అందరం కలిసికట్టుగా పని చేయాలని, పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తను గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, పెద్దలు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘట్‌కేసర్ సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్ గా వాణి రెడ్డి బాధ్యతలు స్వీకరణ ఘట్‌కేసర్ సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్ గా వాణి రెడ్డి బాధ్యతలు స్వీకరణ
ఘట్‌కేసర్, డిసెంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్ నియోజకవర్గం ఘట్‌కేసర్ సర్కిల్‌కు నూతన డిప్యూటీ కమిషనర్‌గా వాణి రెడ్డి శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా...
కాప్రా సర్కిల్ లో  డిప్యూటీ కమిషనర్‌గా కె. శ్రీహరి బాధ్యతలు స్వీకరణ
అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి 
గర్భిణీలకు 102 అమ్మ ఒడి సేవలు.!
వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న బీజేపీ నాయకులు
రైతులు ఉచిత నట్టల నివారణ మందులను సద్వినియోగం చేసుకోవాలి
విశ్వతేజ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరైన కాంగ్రెస్ నాయకుడు వడ్డే శేఖర్