ఓసి సింహ గర్జనను విజయవంతం చేయండి.

ఓసి జాక్ రాష్ట్ర అధ్యక్షులు గోపు జయపాల్ రెడ్డి.

ఓసి సింహ గర్జనను విజయవంతం చేయండి.

హాసన్ పర్తి,డిసెంబర్ 26(తెలంగాణ ముచ్చట్లు):

జాతీయ స్థాయిలో ఓసి లకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలో కూడా అమలు చేయాలని మొదటి నుండి అగ్ర కుల పేదలకు అన్ని రంగాల్లో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా హక్కుల సాధనకై జనవరి 11 న ఆర్ట్స్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఈ సభ ద్వారా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కాల పరిమితి 5 సంవత్సరాలకు పెంచాలని ఈడబ్ల్యూఎస్  విద్యా, ఉద్యోగ పోటీ పరీక్షల వయోపరిమితి పెంచాలని ఈడబ్ల్యూఎస్ బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని విద్యార్థులకు టెట్ రాత పరీక్ష అర్హతకు 90 మార్కుల నుండి 70 మార్కులకు తగ్గించాలని, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలనే డిమాండ్లతో జనవరి 11న నిర్వహించే సభకు రెడ్డి,బ్రాహ్మణ,వైశ్య,మార్వాడి, కమ్మ,వెలమ సోదరులు తరలిరావాలని ఓ సి జాక్ అధ్యక్షుడు పిలుపునిచ్చారు.
శుక్రవారం రోజు బాలాజీ గార్డెన్స్ లో వీసం సురేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభ సన్నాహక సమావేశానికి గోడ పత్రిక ఆవిష్కరణకు ఓసిజాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుబ్బ శ్రీనివాస్ ఓ సి జాక్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అర్జుల కిషన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చకిలం రాజేశ్వర్ రావు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా సితంపేట సర్పంచ్ మేక రమ్య భగవాన్ రెడ్డి,కేశవపూర్ సర్పంచ్ మోత్కుపల్లి శ్రీకాంత్ రెడ్డి ఉప సర్పంచులు, సుడుల భరత్ రెడ్డి పోరెడ్డి వాణి విలాకర్ రెడ్డి వార్డు సభ్యులను సన్మానించారు.ఈ కార్యక్రమంలో వివిధ ఓ సి కులాల ప్రతినిధులు పాడి మల్ల రెడ్డి వీసం రవీందర్ రెడ్డి కర్ణకర్ రెడ్డి మధుకర్ రెడ్డి రాజిరెడ్డి సుధీర్, శంకర్, భీష్మనాధం, మాధవ శంకర్, శ్యామ్ సుందర్, చంద్ర శేఖర్, నరేందర్ రెడ్డి, సరోత్తం రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి,దేవేందర్ రెడ్డి, పార్థసారథి, కృష్ణమూర్తి,డాక్టర్ అజిత్ జైపాల్ రెడ్డి, నరోత్తం రెడ్డి,జగ్గారెడ్డి తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘట్‌కేసర్ సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్ గా వాణి రెడ్డి బాధ్యతలు స్వీకరణ ఘట్‌కేసర్ సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్ గా వాణి రెడ్డి బాధ్యతలు స్వీకరణ
ఘట్‌కేసర్, డిసెంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్ నియోజకవర్గం ఘట్‌కేసర్ సర్కిల్‌కు నూతన డిప్యూటీ కమిషనర్‌గా వాణి రెడ్డి శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా...
కాప్రా సర్కిల్ లో  డిప్యూటీ కమిషనర్‌గా కె. శ్రీహరి బాధ్యతలు స్వీకరణ
అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి 
గర్భిణీలకు 102 అమ్మ ఒడి సేవలు.!
వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న బీజేపీ నాయకులు
రైతులు ఉచిత నట్టల నివారణ మందులను సద్వినియోగం చేసుకోవాలి
విశ్వతేజ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరైన కాంగ్రెస్ నాయకుడు వడ్డే శేఖర్