ఘనంగా మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జయంతి వేడుకలు
Views: 7
On
ధర్మసాగర్,డిసెంబర్25(తెలంగాణ ముచ్చట్లు):
ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామంలో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జయంతి వేడుకలను భారతీయ జనతా పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేకును కట్ చేసి వాజ్‌పేయికి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో వాజ్‌పేయి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన చూపిన పాలనా దార్శనికత నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. జాతీయ ఐక్యత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో వాజ్‌పేయి చేసిన కృషిని వారు గుర్తు చేశారు.
ఈ వేడుకల్లో పెసరు వెంకటేష్, ననుబాల కుమారస్వామి, హరిష్, వెంకటేష్, శివ, బిక్షపతి, సర్వేశ్, ప్రసాద్, వెంకటస్వామి, రాజు, రాజు, రాకేష్, సంజీవ్, మహేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
27 Dec 2025 17:42:39
ఘట్‌కేసర్, డిసెంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ నియోజకవర్గం ఘట్‌కేసర్ సర్కిల్‌కు నూతన డిప్యూటీ కమిషనర్‌గా వాణి రెడ్డి శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా...


Comments