కుషాయిగూడ డివిజన్ పేరు  అధికారికంగా ప్రకటించిన

 గ్రామస్తులు ఆనందోత్సాహాలు బాణాసంచా కాల్చి సంబరాలు

కుషాయిగూడ డివిజన్ పేరు  అధికారికంగా ప్రకటించిన

కుషాయిగూడ, (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ కుషాయిగూడ డివిజన్ పేరును అధికారికంగా ఖరారు చేయడంతో కుషాయిగూడ గ్రామస్తులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుషాయిగూడ బస్‌స్టాప్‌ వద్ద కుషాయిగూడ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామస్తులు, కుషాయిగూడకు చెందిన వివిధ కాలనీల సభ్యులు కలిసి ఘనంగా సంబరాలు నిర్వహించారు.డివిజన్ పేరు ఖరారు కావడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొంటూ బాణాసంచా కాల్చి, ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ ఆనందం పంచుకున్నారు. కుషాయిగూడకు ప్రత్యేక గుర్తింపు లభించిందని, భవిష్యత్తులో అభివృద్ధి పనులకు మరింత ఊతం లభిస్తుందని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో కుషాయిగూడ అసోసియేషన్ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంబరాలను మరింత ఉత్సాహభరితంగా నిర్వహించారు.IMG-20251226-WA0018

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .