రామాంతపూర్‌లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
రామాంతపూర్, డిసెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం రామాంతపూర్ చర్చి కాలనీ పరిధిలోని లుద్ మాత చర్చిలో క్రిస్మస్ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి, ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.చర్చి కాలనీ సభ్యులతో కలిసి క్రిస్మస్ పండుగ కేక్‌ను కట్ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, క్షమాగుణం, శాంతి సందేశాలు ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని పిలుపునిచ్చారు. శత్రువుల పట్ల కూడా క్షమాభావంతో ఉండాలని క్రీస్తు ఇచ్చిన సందేశం నేటి సమాజానికి ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆనంద్, జానీ, సుధాకర్, సతీష్, డేవిడ్, రత్న రెడ్డి, లక్ష్మా రెడ్డి, ప్రవీణ్ కుమార్, వాళ్లపు శ్రీకాంత్ యాదవ్, ఉపేందర్ రెడ్డి, సందీప్, భాస్కర్, వినయ్, కిరణ్, రాజు, రమ్మన, ఆరోగ్యమ్మ, సుమలత, బాబు రావు, శ్రీనివాస్, ఇన్నాశమ్మ, మేరీ, లూద్ రెడ్డి, రోజీ మేరీ, జయశీలం, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.అలాగే పెద్ద సంఖ్యలో క్రైస్తవ సహోదరులు, డివిజన్ నాయకులు హాజరై క్రిస్మస్ వేడుకలను విజయవంతం చేశారు.


Comments