సెరినిటీ పాఠశాలలో ఘనంగా క్రిస్మస్, స్వయం పాలనా దినోత్సవ వేడుకలు
నాగారం, డిసెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
జిహెచ్ఎంసి నాగారం మున్సిపాలిటీ పరిధిలో సెరినిటీ పాఠశాలలో క్రిస్మస్ మరియు స్వయం పాలనా దినోత్సవ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ నోముల జంగిరెడ్డి మాట్లాడుతూ, ప్రపంచ మానవాళికి సేవాతత్పరత, శాంతిని బోధించిన ఏసుక్రీస్తు ఉపదేశాలు సర్వమానవాళికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.పాఠశాల ఆవరణలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా కీసర మాజీ జిల్లా ప్రాదేశిక సభ్యులు ముప్పు రాంరెడ్డి హాజరై, చిన్నారులకు ఆశీర్వాదాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్య కార్యక్రమాలు ప్రేక్షకులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.స్వయం పాలనా దినోత్సవంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి బోధన చేయడం, పాఠశాల నిర్వహణ బాధ్యతలను స్వయంగా నిర్వహించడం విశేషంగా నిలిచింది. తమ పాత్రల్లో పూర్తిగా లీనమై, ఆనందోత్సాహాలతో కర్తవ్య నిర్వహణ చేయడం అందరినీ ఆకర్షించింది.చిన్న వయసులోనే బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం భవిష్యత్ జీవితానికి ఎంతో ఉపయోగకరమని కరస్పాండెంట్ నోముల జంగిరెడ్డి తెలిపారు. ఈ రోజంతా చిన్నారుల ఆటపాటలు, కార్యక్రమాలతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది.ఈ రెండు కార్యక్రమాల్లో పాఠశాల ప్రధాన కార్యదర్శి నోముల వసంత, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments