విశ్వతేజ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరైన కాంగ్రెస్ నాయకుడు వడ్డే శేఖర్

విశ్వతేజ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరైన కాంగ్రెస్ నాయకుడు వడ్డే శేఖర్

పెద్దమందడి,డిసెంబర్26(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన డీలర్ విజయ్ కుమార్–లావణ్య దంపతుల కుమారుడు విశ్వతేజ్ తొలి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకుడు వడ్డే శేఖర్ హాజరై చిన్నారి విశ్వతేజ్‌ను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా ఆయన తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిన్నారి ఆయురారోగ్యాలతో, విద్యాబుద్ధులతో మంచి భవిష్యత్తు సాధించాలని ఆకాంక్షించారు. జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి చిన్నారితో కలిసి ఫోటోలు దిగారు.ఈ వేడుకల్లో గ్రామ కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు, బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలు ఆనందోత్సాహాల మధ్య సాంప్రదాయబద్ధంగా కొనసాగాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వడ్డే శేఖర్, మద్దూర్ నరసింహ, మల్లికార్జున్, దయ్యాల శేఖర్,మద్దూర్ వెంకటయ్య, దానయ్య, మోహన్ కుమార్, శ్యాంసుందర్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .