భవానీ నగర్‌లో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం
నాచారం, డిసెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గ కాప్రా సర్కిల్ నాచారం డివిజన్ లో భవానీ నగర్ వీధి నెంబర్–2లో కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన 25వ అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, అయ్యప్ప స్వామి భక్తి మార్గం సమాజానికి శాంతి, క్రమశిక్షణ, ఐక్యతను అందిస్తుందన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సామాజిక సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్, మోహన్ రెడ్డి, భూపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై మహోత్సవాన్ని విజయవంతం చేశారు.


Comments