మల్లాపూర్ లో బస్తీ బాట కార్యక్రమంలో నెమలి అనిల్ కుమార్ పర్యటన
మల్లాపూర్, డిసెంబర్ 26 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ మల్లాపూర్ డివిజన్ లో“బస్తీ బాట” కార్యక్రమంలో భాగంగా పఠాన్ బస్తీలో గ్రేటర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా బస్తీలో నూతనంగా మంజూరైన డ్రైనేజీ పనులు, తాగునీటి సరఫరా వ్యవస్థను పరిశీలించారు.బస్తీ బాట కార్యక్రమంలో గుర్తించిన మిగతా అభివృద్ధి పనులను ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి సహకారంతో అతి త్వరలో పూర్తి చేస్తామని బస్తీ వాసులకు నెమలి అనిల్ కుమార్ హామీ ఇచ్చారు. ప్రజలకు కనీస సౌకర్యాలు సమర్థవంతంగా అందేలా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తాండ్ర శ్రీకాంత్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి వుండం శ్రీనివాస్, సీనియర్ నాయకులు కోయలకొండ రాజేష్, సురేష్ గౌడ్, అన్వర్, ఇబ్రహీం, మహిళా నాయకురాళ్లు ఇష్రాత్ బనో, ఇంతియాజ్ బేగం, బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు 


Comments