డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నినాదాలతో మనుస్మృతి దహన కార్యక్రమం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నినాదాలతో మనుస్మృతి దహన కార్యక్రమం

ఏ ఎస్ రావునగర్, డిసెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు)

తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో గురువారం ఈసీఐఎల్ చౌరస్తా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మనుస్మృతి దహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 1927లో డిసెంబర్ 25న మనుస్మృతిని సామూహికంగా దహనం చేసి, భారతదేశంలో కులవాదంపై పోరాటానికి పునాదులు వేశారు. మనుషులను సమానంగా చూడకపోవడాన్ని నిరసిస్తూ, మనువాద ప్రతులను తగలబెట్టిన ఆయన దళిత, నిర్లక్ష్యిత వర్గాల హక్కుల కోసం స్ఫూర్తిదాయకంగా నిలిచారు.ఈ కార్యక్రమానికి స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు. సామాజిక ఉద్యమ నాయకులు పి. మల్లేశం మాట్లాడుతూ, “భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులను కల్పించినప్పటికీ, నేటి పాలకులు మనువాదాన్ని తిరిగి స్థాపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలు దీనికి వ్యతిరేకంగా గట్టిగా ఆవాజ్ వేయాలి” అన్నారు.
సామాజిక నాయకులు జయరాజు, గుమ్మడి హరి ప్రసాద్, శివన్నారాయణ, గొడుగు యాదగిరిరావు ప్రసంగించారు. అనంతరం మనుస్మృతి ప్రతులను తగలబెట్టి, “మనువాదం నశించాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడాలి” అనే నినాదాలు వినిపించాయి.ఈ కార్యక్రమంలో బాలు, గిరీష్, ఎం. భాస్కర్ రావు, పి. మల్లేశం, గుమ్మడి హరి ప్రసాద్,జయరాజ్, శివన్నారాయణ, రుక్కయ్య తదితరులు పాల్గొన్నారు. IMG-20251225-WA0121

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .