వెల్టూర్‌లో క్రిస్మస్ సందర్భంగా చర్చ్‌కు కుర్చీలు విరాళం

వెల్టూర్‌లో క్రిస్మస్ సందర్భంగా చర్చ్‌కు కుర్చీలు విరాళం

క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

-- మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి, గ్రామ సర్పంచ్ అశోక్

పెద్దమందడి,డిసెంబర్25(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొదటగా మాజీ జడ్పిటిసి రఘుపతి రెడ్డి క్రైస్తవ సోదరులను ఉద్దేశించి మాట్లాడారు.క్రిస్మస్ పండుగ త్యాగం, సేవ, మానవత్వాన్ని బోధిస్తుందని ఆయన అన్నారు. గ్రామాభివృద్ధితో పాటు మత సామరస్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.వెల్టూర్ గ్రామంలో అన్ని మతాలు కలిసికట్టుగా పండుగలు జరుపుకోవడం గర్వకారణమని తెలిపారు. క్రైస్తవ సోదరులు ఆరోగ్యంగా, ఆనందంగా క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం గ్రామ సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ.. క్రిస్మస్ పండుగ సందర్భంగా మన చర్చ్‌కు 25 కుర్చీలను విరాళంగా అందజేయడం ఆనందంగా ఉందని తెలిపారు. కాలనీ యువతతో కలిసి ఈ కుర్చీలు అందజేయడం జరిగిందని చెప్పారు.గ్రామంలో ఏ మతానికి సంబంధించిన కార్యక్రమమైనా గ్రామపంచాయతీ తరఫున సహకారం ఉంటుందని, అవసరమైనప్పుడు ప్రతి వర్గానికి అండగా నిలబడతామని సర్పంచ్ అశోక్ భరోసా ఇచ్చారు.అలాగే చర్చికి కావలసిన ప్రహరీ గోడ నిర్మాణం, పై కప్పు, అదనపు గది వంటి వసతులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. క్రైస్తవ సోదరులు సుఖసంతోషాలతో క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆహ్వానం మేరకు వెంటనే స్పందించి కార్యక్రమానికి హాజరైన గ్రామ సర్పంచ్ అశోక్, మాజీ జడ్పిటిసి రఘుపతి రెడ్డి, అలాగే గ్రామ పెద్దలకు యేసు ప్రభువు దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ పాస్టర్ సురేష్ కుమార్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో  మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి, గ్రామ సర్పంచ్ అశోక్, హంసు వర్మ, ఆర్ పెద్ద శ్రీనివాస్ రెడ్డి, వడ్డే శేఖర్, నాగభూషణ్, పట్నం సత్యన్న, ఇరికిశెట్టి మధు, దయ్యాల అశోక్,అంజి, దయల రమేష్, దేవదానం, శ్యాంసుందర్, గుండెల సుభాష్ బండి చంద్రన్న, పట్నం దశరథ,గ్రామపెద్దలు, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. IMG-20251225-WA0125

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘట్‌కేసర్ సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్ గా వాణి రెడ్డి బాధ్యతలు స్వీకరణ ఘట్‌కేసర్ సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్ గా వాణి రెడ్డి బాధ్యతలు స్వీకరణ
ఘట్‌కేసర్, డిసెంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్ నియోజకవర్గం ఘట్‌కేసర్ సర్కిల్‌కు నూతన డిప్యూటీ కమిషనర్‌గా వాణి రెడ్డి శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా...
కాప్రా సర్కిల్ లో  డిప్యూటీ కమిషనర్‌గా కె. శ్రీహరి బాధ్యతలు స్వీకరణ
అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి 
గర్భిణీలకు 102 అమ్మ ఒడి సేవలు.!
వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న బీజేపీ నాయకులు
రైతులు ఉచిత నట్టల నివారణ మందులను సద్వినియోగం చేసుకోవాలి
విశ్వతేజ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరైన కాంగ్రెస్ నాయకుడు వడ్డే శేఖర్