పొన్నకల్ నూతన సర్పంచ్ మైమూద్‌ను సన్మానించిన బిఆర్ఎస్ నాయకులు
Views: 6
On
అడ్డాకల్,డిసెంబర్25(తెలంగాణ ముచ్చట్లు):
అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థి పొన్నకల్ మైమూద్ (తెలంగాణ ఉద్యమ కారుడు)ను గ్రామ ప్రజలు అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించారు. ఈ సందర్భంగా ఆయన స్వగ్రామానికి వచ్చిన సందర్భంగా బలీదు పల్లి, వెలటూర్ గ్రామాలకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు మైమూద్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దయాకర్, మల్లక్ సురేష్ కుమార్ (వెలటూర్ బీఆర్‌ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు), నాయకులు శ్రీధర్ యాదవ్, మంగరాయి వెంకటేష్, వంకని ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
27 Dec 2025 17:42:39
ఘట్‌కేసర్, డిసెంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ నియోజకవర్గం ఘట్‌కేసర్ సర్కిల్‌కు నూతన డిప్యూటీ కమిషనర్‌గా వాణి రెడ్డి శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా...


Comments