మేడ్చల్ జిల్లా మున్నూరుకాపు సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
కీసరగుట్ట, డిసెంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం శనివారం కీసరగుట్టలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మున్నూరుకాపు సంఘం పూర్తిస్థాయి కమిటీని అధికారికంగా ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు వేల్పుల శ్రీనివాస్ పటేల్, ప్రధాన కార్యదర్శి చాట్లపల్లి నర్సింగ్ రావు పటేల్‌తో పాటు ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, కార్యనిర్వాహక కార్యదర్శులు, ప్రచార కార్యదర్శులు, ముఖ్య సలహాదారులు, సలహాదారులు, కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ పుటం పురుషోత్తం రావు పటేల్ మాట్లాడుతూ, కుటుంబంతో పాటు కులానికి, సమాజానికి సమయం కేటాయించాలని సూచించారు. వ్యక్తిగా కాకుండా సంఘటిత శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు. సేవ చేసే వారికి పదవులిచ్చి గౌరవించాలన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ అందరికీ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.త్వరలో నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించి, ఎన్నికల ఇన్‌చార్జిగా మామిండ్ల శ్రీనివాస్ పటేల్‌ను నియమించారు.వివిధ రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్న మున్నూరుకాపు నాయకులు ఐక్యంగా ఉండాలని, ఎన్నికల్లో మనవాళ్లు పోటీ చేస్తే ఒక్కరినే నిలబెట్టి గెలిపించేలా వ్యవహరించాలని సూచించారు. తన శేష జీవితాన్ని కుల సేవకే అంకితం చేస్తానని పేర్కొన్నారు.జిల్లా నూతన అధ్యక్షుడు వేల్పుల శ్రీనివాస్ పటేల్ మాట్లాడుతూ, కులానికి ఎవరూ పెద్ద కాదని, అందరూ సమానమేనని అన్నారు. ఐకమత్యంతో రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. అందరి సమన్వయంతో మేడ్చల్ జిల్లా కమిటీని ఆదర్శంగా నిలుపుతామని తెలిపారు.
మామిండ్ల శ్రీనివాస్ పటేల్ మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడు బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని, అందరూ సహకరిస్తామని అన్నారు. కుల పెద్ద బుద్ధి సత్తయ్య పటేల్ మాట్లాడుతూ రాజకీయ పార్టీల్లో మున్నూరుకాపులకు వివక్ష జరుగుతోందని, రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఒక్కరే పోటీ చేసేలా అవగాహన కల్పించి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతంశెట్టి వెంకటేశ్వర్లు పటేల్, యంజాల పద్మయ్య పటేల్, ఇందూరి తిరుపతి పటేల్, ఆకుల సత్యనారాయణ పటేల్, కీసర సంఘం అధ్యక్షుడు మహేందర్ పటేల్, కర్ర వెంకన్న పటేల్, మండల ఈశ్వరయ్య పటేల్, కటికం రాజు పటేల్, సింగం పవన్ కుమార్ పటేల్, సింగం రాజు పటేల్, పుప్పాల వెంకటేశ్వర్లు పటేల్, సగ్గిడి శ్రీకాంత్పటేల్ తదితరులు పాల్గొన్నారు. 


Comments