ప్రతి ఒక్కరూ సేవాభావంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించాలి
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టై, బెల్ట్, షూస్ పంపిణీ
-- దాతలు రత్నం నాగలక్ష్మి- ధన విజయ్ గౌడ్ దంపతులు
పెద్దమందడి,డిసెంబర్27(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం మాదిగట్ల–మోజర్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి, ప్రస్తుతం విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఉద్యోగం చేస్తున్న రత్నం నాగలక్ష్మి–ధన విజయ్ గౌడు దంపతుల కుమారుడు సాయి కృష్ణ గౌడ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం పాఠశాలలో సేవా కార్యక్రమం నిర్వహించారు.తాను చదువుకున్న ప్రభుత్వ పాఠశాలకు, సొంత ఊరికి ఏదో చేయాలనే తపనతో, సామాజిక దృక్పథంతో ఆలోచించి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు.ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు దీటుగా క్రమశిక్షణతో,ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్న ఉద్దేశంతో ఈ వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కుమారుడి సాయి కృష్ణ గౌడ్ జన్మదిన సందర్భంగా.. తల్లిదండ్రులు రత్నం నాగలక్ష్మి, ధన విజయ్ గౌడ్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న 200 మంది విద్యార్థులకు టై, బెల్ట్, షూస్ పంపిణీ చేశారు.ముందుగా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి, అనంతరం విద్యార్థులకు సామగ్రిని అందజేశారు.ఈ కార్యక్రమానికి మాదిగట్ల–మోజర్ల గ్రామ వివేకానంద యూత్ ఆధ్వర్యం వహించగా, పాఠశాల ఉపాధ్యాయ బృందం సహకరించింది. ఈ సందర్భంగా సాయి కృష్ణ గౌడ్ తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, సేవా భావనతో ముందుకు వచ్చే వారు మరింత మంది ఉండాలని ఆకాంక్షించారు.ఈ సేవా కార్యక్రమం విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని గ్రామస్థులు ప్రశంసిస్తూ, యువతకు ఆదర్శంగా నిలిచే కార్యక్రమమని గ్రామ పెద్దలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం ఉపాధ్యాయ బృందం, మదిగట్ల సర్పంచ్ అమ్మపల్లి సర్పంచ్ మాధవి వెంకటేశ్వర రెడ్డి, వివేకానంద యూత్ కమిటీ సభ్యులు, వివిధ గ్రామాల నాయకులు రత్న నాగలక్ష్మి, ధన విజయ్ గౌడ్ దంపతులను అభినందిస్తూ ఘనంగా సన్మానించారు., ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, మోజర్ల ,మద్దిగట్ల అమ్మపల్లి గ్రామాల నాయకులు, వివేకనంద యూత్ కమిటీ సభ్యులు, రత్నం నాగలక్ష్మి, ధన విజయ్ గౌడ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


Comments