మృతుల కుటుంబాలను పరామర్శించిన బొజ్జ రాజు యాదవ్
గెలిచినా ఓడిన నిత్యం ప్రజలతోనే ఉంటా
వేలేరు,డిసెంబర్16(తెలంగాణ ముచ్చట్లు):
మల్లికుదుర్ల గ్రామంలో ఇటీవల మృతి చెందిన కుంట సోమక్క(సోక్కమ్మ) , బట్టు సునీల్ మరణించగా విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన బొజ్జ రజిత రాజు యాదవ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి మంగళవారం మృతుల కుటుంబాల ఇంటికి వెళ్లి పరామర్శించి , వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గ్రామంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని, ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని బొజ్జ రజిత - రాజు యాదవ్ అన్నారు. గ్రామంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నముందుండి పనిచేస్తామని తనని నమ్ముకున్న కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉండి పనిచేస్తామన్నారు.
. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ గోధల రాజిరెడ్డి , కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు తెల శ్రీకాంత్ యాదవ్, బొజ్జ సమ్మయ్య యాదవ్, రవీందర్ యాదవ్ , కత్తి దయాకర్ ,మారుపాక రవి ,భగవాన్ , రామలింగం , కుంట రాజు, బొజ్జ ప్రవీణ్ ,అశోక్ ,రజినీకాంత్,రాజు, శ్రీకాంత్, రాకేష్, రాజు, మధు కృష్ణ,అనిల్ , రమేష్, మధు గౌడ్ ,శ్రీనివాస్,సుమన్ రెడ్డి ,కోటి ,రవి,స్వామి,కనుకరాజు, రాము ,అశోక్, అంజయ్య , తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments