కూరగాయల సాగులో ఆధునిక మెళకువలపై 3 రోజుల శిక్షణ ముగింపు

ఇజ్రాయిల్ అగ్రికల్చర్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో కార్యక్రమం

కూరగాయల సాగులో ఆధునిక మెళకువలపై 3 రోజుల శిక్షణ ముగింపు

మేడ్చల్–మల్కాజిగిరి, డిసెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):

ఇజ్రాయిల్ అగ్రికల్చర్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా “కూరగాయల సాగులో మెళకువలు” అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం బుధవారం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమాన్ని ఉద్యానశాఖ జాయింట్ డైరెక్టర్ రామలక్ష్మి నిర్వహించారు.జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఫర్ వెజిటెబుల్స్ అండ్ ఫ్లవర్స్లో జరిగిన ఈ శిక్షణా కార్యక్రమంలో ఇజ్రాయిల్‌కు చెందిన కూరగాయల సాగు నిపుణులు, ఇజ్రాయిల్ ఎంబస్సీ అగ్రికల్చర్ అటాచ్ మాషావ్ ఉరిరాబిన్ స్టీన్, డ్యానిల్ హదాద్ (ఎంబస్సీ ఆఫ్ ఇజ్రాయిల్), జిల్లా ఉద్యానశాఖాధికారి శ్రీధర్ పాల్గొన్నారు. అలాగే దేశంలోని 12 రాష్ట్రాల నుంచి వచ్చిన 40 మంది ఉద్యానశాఖ అధికారులు ఈ శిక్షణలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ రామలక్ష్మి మాట్లాడుతూ, నిపుణులు అందించిన ఆధునిక సాగు మెళకువలు రైతులకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. శిక్షణలో మట్టిరహిత కూరగాయల సాగు విధానాలు, బిందుసేద్యం ప్రాముఖ్యత, నీటిలో కరిగే ఎరువుల యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారన్నారు.
అలాగే వాతావరణానికి అనుగుణంగా వంగడాల ఎంపిక, కూరగాయలు ఎక్కువకాలం నిల్వ ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంట కోత అనంతరం పాటించాల్సిన పద్ధతులపై నిపుణులు వివరించారు. కూరగాయల పంటల్లో నులిపురుగుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలహాలు ఇచ్చారు.IMG-20251217-WA0078శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యానశాఖ అధికారులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులకు సర్టిఫికెట్లు అందజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మృతుల కుటుంబాలకు మంత్రి పొంగులేటి పరామర్శ మృతుల కుటుంబాలకు మంత్రి పొంగులేటి పరామర్శ
ఖమ్మం బ్యూరో డిసెంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు)  తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి  రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కాంగ్రెస్...
బాధ్యతాయుత జర్నలిజమే లక్ష్యం
గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీనే బలంగా ఉంది
కుషాయిగూడ డివిజన్ ఏర్పాటును అడ్డుకునేందుకు కుట్రలు 
పీచరలో కూరగాయల మార్కెట్‌కు స్థల పరిశీలన
నూతనంగా ఎన్నికైన అయ్యవారిపల్లె, పెద్ద మునగల్ షెడ్ సర్పంచులకు ఘన సన్మానం 
ఎన్నికల విధుల్లో అకాల మరణం పొందిన వెంకటాపురం ఎంపీడీవో రాజేంద్రప్రసాద్