జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్‌గా ప్రకటించాలి  ఎమ్మెల్యేకు వినతి పత్రం 

జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్‌గా ప్రకటించాలి  ఎమ్మెల్యేకు వినతి పత్రం 

కాప్రా, డిసెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ తో జమ్మిగడ్డ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగుతోంది. ఈ సందర్భంగా మంగళవారం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని కలిసి, జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్‌గా ప్రకటించాలని సాధన సమితి నేతలు వినతి పత్రం అందజేశారు.అనంతరం సాధన సమితి ప్రతినిధులు జీహెచ్ఎంసీ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి కమిషనర్‌, మేయర్‌లకు కూడా వినతి పత్రం సమర్పించారు. ప్రస్తుతం జమ్మిగడ్డ ప్రాంతం పలు డివిజన్లలో విభజించబడటం వల్ల అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పనలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు పేర్కొన్నారు. జమ్మిగడ్డలోని అన్ని కాలనీలను ఒకే డివిజన్‌గా కలిపి ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటు చేయాలని వారు కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .