50 చర్చిలకు రూ.15 లక్షల నిధుల పంపిణీ
క్రీస్తు ప్రవచన మార్గంలో ప్రేమను పెంపొందిద్దాం పట్నం మహేందర్ రెడ్డి
మేడ్చల్ మల్కాజిగిరి, డిసెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు) :
క్రీస్తు ప్రవచన మార్గంలో ప్రేమను విస్తరింపజేస్తూ భారత రాజ్యాంగంలోని లౌకిక తత్వాన్ని మరింత బలోపేతం చేయాలని తెలంగాణ ప్రభుత్వ శాసనమండలి చీఫ్ వీప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్ జిల్లాలో క్రిస్మస్ పండుగ వేడుకలను ఆయన ప్రారంభించారు.మేడ్చల్‌లోని జేవియర్ గార్డెన్‌లో నిర్వహించిన యునైటెడ్ క్రిస్మస్ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్య అతిథిగా హాజరైన మహేందర్ రెడ్డి, 50 చర్చిలకు ఒక్కో చర్చికి రూ.30 వేల చొప్పున మొత్తం రూ.15 లక్షల నిధులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 2,000 మంది క్రైస్తవులతో కలిసి సామూహిక విందులో పాల్గొని సహపంక్తి భోజనం చేశారు. క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవులు సహా మైనారిటీల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు
డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ, మైనారిటీల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పారు. క్రీస్తు ప్రవచన మార్గంలో ప్రేమ, శాంతి సందేశాన్ని అందరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఉపేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు యాదవ్, మాజీ చైర్మన్ సత్యనారాయణ, ఆర్టీవో సభ్యులు జైపాల్ రెడ్డి, హజ్ కమిటీ సభ్యులు ముజీబ్, మేడ్చల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, పోచంపల్లి, అల్వాల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్, తుంకి రమేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments