ఖమ్మంలో రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ

ఖమ్మంలో రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ

--- సర్దార్ పటేల్ స్టేడియంలో 27, 28 లలో డే అండ్ నైట్ మ్యాచులు
--- సర్దార్ పటేల్ స్టేడియం బాల్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అసోసియేషన్ అండ్ టోర్నమెంట్ కన్వీనర్ డాక్టర్ రాధాకృష్ణమూర్తి

ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు)

 తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల స్థాయిలో డిసెంబర్ 27, 28 తేదీలలో ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగే బాల్ బ్యాడ్మింటన్ పోటీలను విజయవంతం చేయాలని సర్దార్ పటేల్ స్టేడియం బాల్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అసోసియేషన్, టోర్నమెంట్ కన్వీనర్ డాక్టర్ రాధాకృష్ణమూర్తి అన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... బాల్ బాడ్మింటన్ లెజెండర్ ప్లేయర్ అండ్ కోచ్ పులి రామస్వామి మెమోరియల్ ఆధ్వర్యంలో, ఖమ్మం జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సహకారంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల స్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పోటీలు బిబిఎఫ్ఐ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం  డిసెంబర్ 27, 28 (శని, ఆదివారం)లలో స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో డే అండ్ నైట్ మ్యాచ్ లను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రెండు రోజులు పాటు జరిగే బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు ఉచిత భోజన వసతి సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్రీడాకారులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి అన్నారు. మ్యాచ్ లు లీగ్ అండ్ సూపర్ లీగ్ తరహాలో నిర్వహించడం జరుగుతుందన్నారు. టీముల నమోదుకు డిసెంబర్ 20 చివరి తేదీ అన్నారు. ప్రతి మ్యాచ్ కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు ఇవ్వడం జరుగుతుందన్నారు. విజేతలకు మొదటి బహుమతిగా రూ. 30 వేలు, 2వ బహుమతి రూ.25వేలు, 3వ బాహుమతి రూ.20వేలు, 4వ బహుమతి రూ. 15వేలు, 5వ బహుమతి రూ. 10వేలతో పాటు మెమొంటోలు ఇవ్వడం జరుగుతుందన్నారు. బాల్ బ్యాడ్మింటన్ అభిమానులు, క్రీడాకారులు టోర్నమెంట్ ను విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో కో-కన్వీనర్ టి రామచంద్రరాజు, కో-ఆర్డినేటర్ విజయ్ కలాం, ఇంచార్జ్ డాక్టర్ పులి మధు, ట్రెజరర్ మణిభూషణ చారి, అడ్వైజర్లు శంకరమూర్తి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తిరుపతిరెడ్డి, ఆర్గనైజింగ్ మెంబర్స్ బద్రి శ్రీకాంత్, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.IMG-20251218-WA0041

Tags:

Post Your Comments

Comments

Latest News

కామ్రేడ్ భూక్య వీరస్వామికి ఘన నివాళులు కామ్రేడ్ భూక్య వీరస్వామికి ఘన నివాళులు
  ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు) కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితమైన యోధుడు, ప్రజా సమస్యల పరిష్కారానికి జీవితాంతం పోరాడిన కామ్రేడ్ భూక్య వీరస్వామి మరణం పట్ల
ఈ నెల 20న తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ 
శ్రీ సంత్ సేవా లాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి 
సీఎంఆర్ఎఫ్ పేద, మధ్య తరగతి ప్రజలకు వరం
మృతుల కుటుంబాలకు మంత్రి పొంగులేటి పరామర్శ
బాధ్యతాయుత జర్నలిజమే లక్ష్యం
గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీనే బలంగా ఉంది