చీర్యాల శివాలయ భూమిపై కబ్జా యత్నం
కీసర తహసీల్దార్‌కు గ్రామస్తుల వినతి
కీసర, డిసెంబర్ 06 (తెలంగాణ ముచ్చట్లు):
కీసర మండలం చీర్యాల గ్రామంలో ఉన్న అతిపురాతన శివాలయం స్థలం అన్యాక్రమణకు గురవుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నప్పటికీ సమస్యకు పరిష్కారం లభించడం లేదని గ్రామ యువకులు పేర్కొన్నారు.సంబంధిత శివాలయం సర్వే నం. 6/2లో ఉన్నప్పటికీ, సమీపంలోని సర్వే నం. 6/1 లేఔట్‌కు చెందిన కొందరు వ్యక్తులు శివాలయ స్థలంలో ప్లాట్లకు రాళ్లు వేస్తూ, ఆక్షేపించిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు.ఇట్టి పురాతన శివాలయం భూమిని లేఔట్ పేరుతో అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, సెర్చ్ ఈసీ ద్వారా పిలిపించి “ఇక్కడ ప్లాట్లు లేవు, ఉన్నా రోడ్డు లేదు” అంటూ బేరాలు జరుపుతున్నారని గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు.ఈ నేపథ్యంలో గ్రామ పెద్దలు, అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో కీసర తహసీల్దార్‌ని కలిసి గుడి ఉన్న సర్వే నం. 6/2 స్థలాన్ని తిరిగి సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని కోరుతూ మెమోరాండం అందజేశారు. రెండు రోజులలో సర్వే చేయిస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చినట్లు గ్రామస్థులు తెలిపారు.ఈకార్యక్రమంలో గ్రామ పెద్దలు కోల కృష్ణ, ఏలూరు శ్రీనివాస్, బక్కని నర్సింగ్ రావు, బోడ నర్సింగ్ రావు, బోడ శ్రీనివాస్, బక్కని కుమార్(జెకే), మళగళ్ల శివకుమార్, బత్తుల అంజి, అనిల్ కుమార్ స్వామి, ఉద్దమర్రి భాస్కర్, బత్తుల రాంచందర్, కొణింటి నర్సింగ్ రావ్, కంచెమిది హన్మంత్ గురుస్వామి, ఆకాష్ స్వామి, విగ్నేష్ స్వామి, శ్యామ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.


Comments