సిఎం  రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ శ్రీనివాస్

సిఎం  రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ శ్రీనివాస్

నర్సంపేట,డిసెంబర్07(తెలంగాణ ముచ్చట్లు):

వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా స్థానిక శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి సమక్షంలో బీసీ సంక్షేమ సంఘం వరంగల్ అధ్యక్షుడు, నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్, బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కలిసి 42 శాతం బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా డ్యాగల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీల ఆకాంక్షలను గౌరవిస్తూ సాధారణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కామారెడ్డి ప్రకటనలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని బాధ్యత వహించినట్లు గుర్తు చేశారు. అయితే రిజర్వేషన్లు పెంచకుండా గ్రామ సర్పంచ్ ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

జెడ్పిటిసి, ఎంపిటిసి, కౌన్సిలర్ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు 42 శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే పార్లమెంటులో రాజ్యాంగ సవరణ అవసరమని, ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీల అఖిలపక్ష బృందాన్ని ప్రధాని వద్దకు తీసుకువెళ్లి తొమ్మిదో షెడ్యూలులో బీసీ రిజర్వేషన్ల చేర్పుకు చర్యలు తీసుకోవాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు.

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్లమెంటు బృందం ఏర్పడి 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేయాలని కూడా వినతిపత్రంలో అభ్యర్థించినట్లు తెలిపారు. కామారెడ్డి ప్రకటనలో ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి రాష్ట్ర ప్రభుత్వం బీసీల ఆకాంక్షలను నెరవేర్చాలని డ్యాగల శ్రీనివాస్ కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువత అధ్యక్షుడు కడారి సురేష్ యాదవ్, పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్, కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్, శీరంశెట్టి రాజేందర్, మండల నాయకులు మారపాక రమేష్ ముదిరాజ్ సహా బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దహనం ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దహనం
వేలేరు,డిసెంబర్18(తెలంగాణ ముచ్చట్లు): వేలేరు మండలం పీచర గ్రామంలో బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత...
సోడాషాపల్లి శివారులో వ్యక్తిని ఢీకొన్న డీసీఎం
చిన్నారులను ఆశీర్వదించిన సర్పంచ్ కిలారు మనోహర్ బాబు.
ఏఐటియుసి ఆధ్వర్యంలో భూక్య వీరస్వామి కుటుంబానికి ఆర్థిక సహాయం..
మీడియా పట్ల వివక్ష సరికాదు
కామ్రేడ్ భూక్య వీరస్వామికి ఘన నివాళులు
ఈ నెల 20న తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ