సోడాషాపల్లి శివారులో వ్యక్తిని ఢీకొన్న డీసీఎం
పౌల్ట్రీ ఫామ్ సూపర్‌వైజర్‌కు తీవ్ర గాయాలు
Views: 9
On
వేలేరు,డిసెంబర్18(తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం సోడాషాపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామానికి చెందిన షాతావాహన పౌల్ట్రీ ఫామ్‌లో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న మేకల శ్రీకాంత్ విధుల నిమిత్తం వెళ్తున్న సమయంలో గుర్తుతెలియని డీసీఎం వాహనం ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో శ్రీకాంత్‌కు తలతో పాటు చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వేలేరు ఎస్సై సురేష్ తెలిపారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం వాహనం వివరాలను సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
18 Dec 2025 22:44:06
వేలేరు,డిసెంబర్18(తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం పీచర గ్రామంలో బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత...


Comments